Virinchinai virachinchitini song lyrics in Telugu



విధాత తలపున ప్రభవించినది

అనాది జీవన వేదం ఓం.....

ప్రాణనాడులకు స్పందన నొసగిన 

అదిప్రణవనాదం  ఓం ....


కనుల కొలనులో ప్రతిధ్వనించిన విశ్వరూప విన్యాసం 

ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం  అ..... అ .... ఆ.......


సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది(2)

నే పాడిన జీవన గీతం..... ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం.. 

విపంచినై వినిపించితిని  ఈ గీతం 


ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన 

జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన

జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన

పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి

 శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ

విరించినై విరచించితిని ఈ కవనం ....

విపంచినై వినిపించితిని ఈ గీతం 


జనించు ప్రతిశిశుగలమున పలికిన జీవన నాద తరంగం 

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగద్వానమ్ 

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా 

సాగిన సృష్టి విలాసమునే 

విరించినై విరచించితిని ఈ కవనం ....

విపంచినై వినిపించితిని ఈ గీతం


నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం(2)

సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన గీతం..... ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం.. 

విపంచినై వినిపించితిని  ఈ గీతం 

.........................................

Movie : Sirivennela 

Song: vidhata thalapuna

Singers : Sp.  Balasubhrahmanyam gaaru 

                 Shusheela gaaru 

Lyricist: Sirivennela Seetharamasastry gaaru

Music : KV.  Mahadevan gaaru

Director : K.  Vishwanatham gaaru. 




Comments

Popular posts from this blog

Oo Rangula chilaka song lyrics / Jayammu Nischayammura movie (2016)