Virinchinai virachinchitini song lyrics in Telugu
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం..... ప్రాణనాడులకు స్పందన నొసగిన అదిప్రణవనాదం ఓం .... కనుల కొలనులో ప్రతిధ్వనించిన విశ్వరూప విన్యాసం ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం అ..... అ .... ఆ....... సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది(2) నే పాడిన జీవన గీతం..... ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రులపైన జాగృత విహంగగతులె వినీల గగనపు వేదికపైన పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ విరించినై విరచించితిని ఈ కవనం .... విపంచినై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతిశిశుగలమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగద్వానమ్ అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనం .... విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం(2) సరసస్వర శురచరీ గమనమౌ...