Oo Rangula chilaka song lyrics / Jayammu Nischayammura movie (2016)


ఓ రంగుల చిలక చూడే నీ యెనక 

అలుపంటూ లేని ఈ పిల్లడి నడక

ఓ బంగరు తళుక చుట్టూ ఏం కనక

ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినక 

ఓసారిటు చూడే పాపంపసివాడే 

నీ చూపుల కోసం వేచి వున్నాడే

అన్ని వదిలేసి నిన్నే వలచాడే 

నీ తలపుల్లోన నిదురే మరిచాడే


మోమాటాలాన్ని పక్కన వదిలాడే

మొండిగా నిను వీడక ముందుకు కదిలాడే

ఎవరేమనుకున్నా తానేమనుకోడే

అంతగా నీ ప్రేమలో మైమరపయ్యడే

ఓసారిటు చూడే పాపంపసివాడే

నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే

బిడియము కలవాడే హృదయము అలలేడే 

ఐన నిను గెలిచే మనసె ఉన్నోడే


నిన్నందరికంటె మిన్నగ చూస్తాడే

నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే 

నీతో నడిచే ఆ ఏడడుగులకోసం 

వేవేలాడుగులనైనా నడిచే ఘనుడె

ఓసారిటు చూడే పాపంపసివాడే

నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే

గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే

దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే

..............................

Movie : Jayammu Nischayammura

Lyrics : Ramanjaneyulu

Singer: Spandhana

Music : Ravichandra







Comments

Popular posts from this blog

Virinchinai virachinchitini song lyrics in Telugu